తమన్నాకు వాళ్ళు దేవుళ్ళు అట
మిల్కీ బ్యూటీ తమన్నా కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఆమె చేసిన సినిమాలు చాలా ఈ సంవత్సరం విడుదల అవటంతో మంచి టాక్ కూడా సొంతం చేసుకున్నాయి. ఓ వైపు చారిత్రక సినిమాలతోపాటు మరో వైపు కమర్షియల్ సినిమాలు ఏదైనా సరే తమన్నా తన సత్తా చూపుతోంది. తెలుగులో సైరా నరసింహరెడ్డిలో కీలక పాత్ర పోషించిన తమన్నా మంచి మార్కులు కొట్టేసింది. తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ ల గురించి తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వాళ్లిద్దరూ తనకు దేవుళ్ళ లాంటి వారని పేర్కొంది.
ఎవరైనా వాళ్ళిద్దరితో కలసి నటించే ఛాన్స్ వస్తే వదులుకుంటారా?.అని ప్రశ్నించింది. అయితే ఇప్పటి వరకూ తాను వాళ్ళిద్దరి సినిమాలు అభిమానిగా చూసి ఆనందించానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మంచి అబ్బాయి దొరికితే వెంటనే పెళ్లికి రెడీ. మీరే మంచి వరుడిని చూసిపెట్టినా పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అంటూ ఈ ప్రశ్న అడిగిన విలేకరికి కూడా ఓ ఝలక్ ఇచ్చింది ఈ బ్యూటీ.