Telugu Gateway
Cinema

‘అల..వైకుంఠపురము’లో టబు లుక్

‘అల..వైకుంఠపురము’లో టబు లుక్
X

తెలుగు వెండితెరపై టబు కన్పించక చాలా కాలమైంది. గతంలో ఆమె చేసిన సినిమాలు చాలా వరకూ హిట్సే. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ‘అల..వైకుంఠపురములో’ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. సోమవారం నాడు టబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా అల..వైకుంఠపురములో చిత్ర యూనిట్ ఆమె లుక్ ను విడుదల చేసింది. దీంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఆమె చూపులు మన హృదయాలను కొల్లగొడతాయి. ఆమె టాలెంట్ తో ఎవరినైనా ఆకట్టుకోగలదు. టబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

మీతో మరిన్ని చిత్రాలు చేయాలని మేం ఎదురుచూస్తున్నాం’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న టబు ఇప్పుడు తెలుగులోనూ సందడి చేయటానికి రెడీ అయ్యారు. మరి ఈ రీ ఎంట్రీ అలా కొనసాగుతూ ఉంటుందా? లేదా వేచిచూడాల్సిందే. టబు తెలుగులో చేసిన మొదటి సినిమా కూలీ నెం1. వెంకటేష్ తో చేసిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. నాగార్జున తో చేసిన ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమాతో టబు ఓ రేంజ్ కు వెళ్లిపోయింది.

Next Story
Share it