Telugu Gateway
Cinema

అంటీ అన్నందుకు తిట్టింది..ఆపై ఏమైంది?

అంటీ అన్నందుకు తిట్టింది..ఆపై ఏమైంది?
X

ఎవరు ఎప్పుడు..ఎందుకు వివాదాల్లో చిక్కుకుంటారో ఎవరికీ తెలియదు. అలాంటిదే ఈ కథ కూడా. ముఖ్యంగా సెలబ్రిటీలు మాట్లాడే ప్రతి మాట ఓ పెద్ద సంచలనంగా మారుతుంటుంది కొన్నిసార్లు. ఇప్పుడు అదే జరిగింది. ప్రముఖ బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ ఇప్పుడు ట్విట్టర్ లో ‘ట్రెండింగ్’ జాబితాలో ఉన్నారు. ‘స్వరా అంటీ’ అంటూ అందరూ ఆమెను ఓ రకంగా వేధిస్తున్నారు అనే చెప్పాలి. అయితే అందుకు ఆమె మాట్లాడిన మాటలే కారణం కావటం విశేషం. అసలు సంగతి ఏంటి అంటే స్వరా భాస్కర్ తాజాగా ‘సన్‌ ఆఫ్‌ అభిష్’ అనే షోలో పాల్గొంది. అందులో ఆమె చేసిన వివాదాస్పదవ్యాఖ్యలే ఈ వివాదానికి కారణం అయ్యాయి. ఈ షోలో ఆమె మాట్లాడుతూ కెరీర్‌ ప్రారంభంలో ఓ యాడ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘యాడ్‌ షూట్‌ చేసే సమయంలో నాలుగేళ్ల బాలుడు నన్ను ఆంటీ అని పిలిచాడు. ఇది నాకెంతో చిరాకు తెప్పించింది. ఎవరికైనా ఆంటీ అని పిలిపించుకోవడం ఇష్టం ఉండదు కదా. ఆంటీ అనగానే నేను కోపంతో చెడామడా తిట్టేశాను. అసలు వీళ్లు చిన్నపిల్లలా లేక దెయ్యాలా’ అని ఆమె అసహనం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె చెప్పేవరకూ ఈ విషయం ఎవరికీ తెలియదు. కానీ షోలో అంతా సరదాగానే నడిపోయింది కానీ అసలు కథ తర్వాతే మొదలైంది. ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద హల్ చల్ చేస్తోంది. అంతే కాదు నెటిజన్లు అంటీ అని పిలిచినందుకు చిన్న పిల్లాడిని అంతగా తిడతావా అంటూ స్వరా అంటీ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. అప్పుడు కాదు.. ఇప్పుడు నిజంగానే నువ్వు ఆంటీ అయ్యావు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలను జాతీయ బాలల సంరక్షణ సంస్థ తీవ్రంగా పరిగణించింది. ఆమెపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోంది. నవంబర్‌ 5న టాప్‌ ట్రెండ్‌లో స్వరా అంటీ కూడా ఒకటిగా నిలిచింది. సో ..ఈ విషయం చెప్పిన పాఠం ఏంటి అంటే బయట ఏమి మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి అని.

Next Story
Share it