Telugu Gateway
Politics

సస్పెన్స్ సినిమాను మించుతున్న ‘మహా రాజకీయాలు’

సస్పెన్స్ సినిమాను మించుతున్న ‘మహా రాజకీయాలు’
X

మహారాష్ట్ర రాజకీయాలు ‘సస్పెన్స్’ సిినిమాను తలపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం కాంగ్రెస్ బయటి నుంచి మద్దతుతో ిశివసేన, ఎన్సీపీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని..మరిన్ని సంప్రదింపులు అవసరం అని పేర్కొంది. అయితే ఓ వైపు శివసేన నేతలు మహారాష్ట్ర గవర్నర్ ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే వీరు తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపించలేకపోయినట్లు గవర్నర్ కార్యాలయం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో మూడు రోజుల సమయం కావాల్సిందిగా శివసేన కోరగా..అందుకు గవర్నర్ తన అసక్తతను వ్యక్తం చేశారు. దీంతో రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పార్టీ సీనియర్ నేతలతో రెండుసార్లు సమావేశం అయినా తుది నిర్ణయం మాత్రం బయటకు రాలేదు. మహారాష్ట్ర నేతలతో చర్చించిన తర్వాత మహారాష్ట్రలోనే మంగళవారం నాడు తుది చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. శివసేనతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ సిద్ధంగానే ఉన్నా కాంగ్రెస్ నిర్ణయమే కీలకంగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు పొత్తుతో కలసి పోటీచేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకుంటే ప్రభుత్వ ఏర్పాటు కూడా సాధ్యం కాదన్న సంగతి తెలిసిందే.

బిజెపి-శివసేనల మధ్య ముఖ్యమంత్రి పదవి పంపకంపై విభేదాలు తలెత్తంతో ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధత నెలకొంది. సీఎం సీటు విషయంలో బిజెపి, శివసేనలు ఏ మాత్రం రాజీపడక పోవటంతో పొత్తుకు బీటలు వారాయి. సోనియాగాంధీ నివాసంలో పార్టీ అగ్రనాయకులు భేటీ అయి.. మహారాష్ట్ర పరిణామాలు, శివసేన సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతునిచ్చే అంశంపై చర్చించారు. సోనియా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఏకే ఆంథోని, అహ్మద్‌ పటేల్‌ వంటి అగ్రనేతలు పాల్గొన్నారు.ఈ భేటీ జరుతుండగానే శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే సోనియాగాంధీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. శివసేన ప్రభుత్వానికి మద్దతునివ్వాల్సిందిగా ఈ సందర్భంగా సోనియాను ఉద్ధవ్ ఠాక్రే కోరారు. సేనతో చేతులు కలిపే విషయంలో కాంగ్రెస్‌ అధినాయకత్వం అంత సుముఖంగా లేకపోయినా.. మహారాష్ట్ర పీసీసీ ఒత్తిడికి తలొగ్గి.. సేనకు మద్దతునివ్వటానికి మొగ్గుచూపినట్లు వార్తలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ అధికారిక ప్రకటన మాత్రం అది ఏమీ లేదని తేల్చేసింది.. గవర్నర్‌ ఆహ్వానం మేరకు శివసేన నేతలు ఆదిత్య ఠాక్రే, ఏక్‌నాథ్‌ షిండే రాజ్‌భవన్‌ లో గవర్నర్ తో సమావేశం అయి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

Next Story
Share it