Telugu Gateway
Cinema

సరదాగా నవ్విస్తున్న ‘సుధీర్’

సరదాగా నవ్విస్తున్న ‘సుధీర్’
X

‘నేను వంద పుష్ అప్స్ చేస్తాను. నేను 108కి కాల్ చేస్తాను. ‘ఫోటోలు పంపిస్తాను వాట్సాప్‌లో ఉన్నావా అని అడిగితే.. లేదంకుల్‌ అమీర్‌పేటలో ఉన్నాను’ అంటూ అమాయకంగా చెబుతున్నాడు. ఇవన్నీ ‘సాఫ్ట్‌ వేర్‌ సుధీర్‌’ సినిమాలో సుడిగాలి సుధీర్ డైలాగులు. ఈ సినిమా ట్రైలర్‌ బుధవారం నాడు విడుదలైంది.

తనకు అలవాటైన పంచ్‌ డైలాగులు, డాన్స్‌ తో సుధీర్‌ ఆకట్టుకున్నాడు. సుధీర్‌కు జోడిగా ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పారిశ్రామికవేత్త కె.శేఖర్‌ రాజు నిర్మించిన ఈ సినిమాను డిసెంబర్‌ మొదటి వారంలో విడుదల చేయనున్నారు.

https://www.youtube.com/watch?v=Q7rZ4aCEes0

Next Story
Share it