తెలంగాణలో ‘స్కైవర్త్’ 700 కోట్ల రూపాయల పెట్టుబడి

తెలంగాణకు మరో కీలక పరిశ్రమ. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ పరిశ్రమ స్కై వర్త్ రాష్ట్రంలో 700 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. ఈ సంస్థ మొదటి దశలో హైదరాబాద్ కేంద్రంగా 700 కోట్ల రూపాయల పెట్టుబడితో 50 ఎకరాలలో అత్యాధునిక ఉత్పాదక ప్లాంటును ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రంగ పెట్టుబడిగా ఇది నిలవనుంది. స్కై వర్త్ టీవీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, లిథియం బ్యాటరీల తయారీ చేపట్టనుంది. స్కైవర్త్ గ్రూప్ బోర్డు ఛైర్మన్ లై వీడ్ శుక్రవారం నాడు తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ పెట్టుబడి ప్రణాళికలను వివరించారు.
ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సూమారు దాదాపు 5 వేల మందికి దక్కనున్న ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా. స్కైవర్త్ సంస్థ తమ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడంపై మంత్రి కెటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కెటీఆర్ తో భేటీ సందర్భంగా లై వీడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను లభిస్తున్న ప్రోత్సాహం అభినందనీయం అన్నారు. స్కై వర్త్ ద్వారా అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు తీసుకురానుందని. స్థానిక ప్రజల నైపుణ్యాలను పెంచడనికి స్కైవర్త్ పనిచేస్తున్నదని తెలిపారు.