Telugu Gateway
Cinema

సరిలేరు నీకెవ్వరూ ‘టీజర్’ వచ్చేసింది

సరిలేరు నీకెవ్వరూ ‘టీజర్’ వచ్చేసింది
X

మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా టీజర్ వచ్చేసింది. ‘మీరెవరో మాకు తెలియదు. మీకూ మాకూ ఏ రక్త సంబంధం లేదు. కానీ మీ కోసం..మీ పిల్లల కోసం పగలూ, రాత్రీ, ఎండా..వానా లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత.’ అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగ్ లు ఆకట్టుకుంటాయి. ఆర్మీ అధికారిగా పనిచేస్తున్న మహేష్ బాబు టీజర్ లో ఆర్మీ చేసే త్యాగాల గురించి చెబుతారు. ఆర్మీ అధికారిగా ఓ వైపు..మరోవైపు కర్నూలులో రౌడీలను ఎదిరించే సందర్భంలోనూ పవర్ ఫుల్ డైలాగ్ లు ఉంటాయి. ‘భయపడే వారే బేరానికి వస్తాడు. మన దగ్గర బేరాలు లేవమ్మా. ’ అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది.జమ్మూ కాశ్మీర్ లోని లొకేషన్లు హైలెట్ గా నిలుస్తాయి.

విలన్ ప్రకాష్ రాజ్ మాత్రం ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు అంటూ వ్యాఖ్యానిస్తాడు. ఎఫ్ 2 సినిమాతో ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడే ఈ సినిమా తెరకెక్కిస్తుండటంతో మహేష్ బాబు కొత్త సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో మహేష్ బాబుకు జోడీగా రష్మిక మందన నటిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ సినిమా విడుదలను జనవరి 12 నుంచి 11వ తేదీకి మార్చింది.

https://www.youtube.com/watch?v=VbuK58iQ_qc

Next Story
Share it