బాలకృష్ణ ‘రూలర్’ టీజర్ విడుదల
BY Telugu Gateway21 Nov 2019 5:30 PM IST

X
Telugu Gateway21 Nov 2019 5:30 PM IST
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘రూలర్’ సినిమా టీజర్ వచ్చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా సోనాల్ చౌహన్, వేదికలు నటించారు. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ చూస్తే పోలీస్ డ్రెస్ లో బాలకృష్ణ లుక్ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. ఇతర స్టైలిష్ డ్రెస్ లో ఓకే అన్పిస్తున్నా..పోలీస్ డ్రెస్ లో మాత్రం వయసు ప్రభావం స్పష్టం కన్పిస్తోంది.
ట్రైలర్ లో బాలకృష్ణ సినిమాల్లో సహజంగా ఉండే ఒక్క ఫైటింగ్ కు పదుల సంఖ్యలో గాల్లోకి ఎగిరే సీన్లు ఉన్నాయి. ‘ఒంటి మీద ఖాకీ యూనిఫాం ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా..బయటకు వచ్చిన సింహంలా ఆగను. ఇక వేటే’ అంటూ సాగే బాలకృష్ణ డైలాగ్ తో టీజర్ ను విడుదల చేశారు.
https://www.youtube.com/watch?time_continue=1&v=XSc9VI418bw&feature=emb_logo
Next Story



