Telugu Gateway
Telangana

‘కన్నీళ్ళు’ తెప్పిస్తున్న ఆర్ కృష్టయ్య ఫేస్ బుక్ పోస్టు

‘కన్నీళ్ళు’ తెప్పిస్తున్న ఆర్ కృష్టయ్య ఫేస్ బుక్ పోస్టు
X

ఆర్టీసీ సమ్మె. తెలంగాణలో దాదాపు రెండు నెలల నుంచి ప్రతి నోటా విన్పిస్తున్న మాట. సమ్మె ముగిసినా కార్మికుల కష్టాలు మాత్రం ముగియటంలేదు. రోడ్లెక్కి విధుల్లో తీసుకోమని మహిళా సిబ్బంది పాటు పలువురు కన్నీటితో వేడుకొంటున్నారు. ఇది టీవీల్లో చూసిన చాలా మంది పరిస్థితి కూడా అంతే. ఆర్టీసీ కార్మికుల కష్టాల చూసి ‘కరగని’ హృధయం లేదు. ఎవరిది తప్పు...ఎవరిది ఒప్పు అనే చర్చ సంగతి పక్కన పెడితే తక్షణం చేపట్టాల్సిన చర్యలే ముఖ్యం. ఆర్టీసి కార్మికుల కష్టాలపై బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ చదివిన వారికి కూడా కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆయన పోస్టు యథాతథంగా....

‘చేతులు జోడించి, కన్నీళ్లతో "మమ్మల్ని ఉద్యోగం లోకి తీసుకోండి" అని మీడియా ముందు వేడుకొంటున్న ఆర్టీసీ ఉద్యోగిని చూస్తూ ఉబికి వస్తున్న కన్నీళ్లని ఆపుకొని పక్కకు చూస్తే నాతో పాటు వార్తలు చూస్తున్న మాయావిడ ఏడ్చేస్తోంది. తప్పు ఎవరిది? సమ్మె చేసే హక్కు లేదా వుందా? అన్న మీమాంస కి అతీతంగా తెలంగాణ ప్రభుత్వం మరి ముఖ్యంగా పౌర సమాజం స్పందించాల్సిన చారిత్రక సమయం ఇది.

సమ్మె హక్కు సంగతి వదిలేయండి. కనీసం బతికే హక్కును గుర్తించాలి. ప్రాణాలు పణంగాపెట్టి సొంత రాష్ట్రం సాధించుకొన్న ఆత్మాభిమానం మీడియా ముందు కన్నీళ్ల పర్యంతమవటం అత్యంత దయనీయమైన విషయం. ఒక మనిషి రోడ్డున పడి ఏడవాలి అంటే ఎంత ఆత్మాభిమానం చంపుకోవాలో, ఎంత అంతర్మథనం చెందాలో, ఎంత కడుపు కాలాలో అంతా అయ్యింది. ఒక్కసారి అతని స్థానంలో నేనుంటే అని ఆలోచించండి. రేపో మాపో వచ్చే బంగారు తెలంగాణ ఏమోగాని, తక్షణం మానవీయ తెలంగాణ కావాలి.’

Next Story
Share it