Telugu Gateway
Telangana

ప్రియాంక రెడ్డి హత్య కేసు చేధించిన పోలీసులు

ప్రియాంక రెడ్డి హత్య కేసు చేధించిన పోలీసులు
X

సంచలనం సృష్టించిన యువ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసును పోలీసులు అతి తక్కువ సమయంలో చేధించగలిగారు. ఈ హత్య కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు కూడా ఉన్నారు. వీరంతా కలసి ప్రియాంకరెడ్డిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు నిర్ధారించారు. మహ్మద్‌ పాషా అనే వ్యక్తి(నారాయణపేట)ని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. తొండూపల్లి టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో చిత్రహింసలకు గురిచేసి.. ఆమెను హత్య చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తించారు. ప్రియాంకరెడ్డి పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం... ఆమెను దహనం చేసేందుకు నిందితులు కిరోసిన్ వాడినట్లు వైద్యులు తేల్చారు. శరీరానికి దుప్పట్లు చుట్టి.. ఆపై కిరోసిన్‌ పోసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆమె మృతదేహం 70 శాతం కాలిపోయింది.

ప్రియాంకరెడ్డిని హత్య చేసిన అనంతరం.. ఘటనాస్థలం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల వరకు ఆమె మృతదేహాన్ని లారీలో తీసుకువెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. రాత్రి 9.30 గంటల నుంచి తెల్లవారుజాము వరకూ అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి.. ఆమెను హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. నగరంలోకి రాత్రి సమయంలో లారీలకు ప్రవేశం లేకపోవటంతో తొండూపల్లి గేట్ వద్ద లారీ ఆపి నిందితులు మద్యం సేవించారు. ఈ క్రమంలో టోల్‌గేట్ వద్ద ఒంటరిగా ఉన్న ప్రియాంకరెడ్డిపై కన్నేశారు. అప్పుడే స్కూటీ బాగు చేయిస్తామంటూ ఆమెకు మాయమాటలు చెప్పి తమతో తీసుకువెళ్లారు. లారీని అడ్డుపెట్టి అత్యాచారం చేసి... హతమార్చారు.

Next Story
Share it