Telugu Gateway
Andhra Pradesh

పోలవరం పనులు షురూ

పోలవరం పనులు షురూ
X

పోలవరం పనులు మొదలయ్యాయి. నవంబర్ 1నే మెఘా సంస్థ సాంకేతికంగా భూమి పూజ చేసి రంగంలోకి దిగినా అసలు పనులు మాత్రం గురువారం నాడు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ పనులు ఇంకా ఊపందుకోవాల్సి ఉంది. స్పిల్ వే ప్రాంతంలో కాంక్రీట్ పనులకు సంస్థ గురువారం శ్రీకారం చుట్టింది. తొలిరోజు 100 క్యూబిక్ మీటర్ల పనిని పూర్తి చేసింది. ఈ పనుల శాతాన్ని రోజు రోజుకు పెంచుకుంటూపోతూ లక్ష్యం మేరకు పనులను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలోని రోడ్లను మరమ్మతులు చేసి ఆ ప్రాంతాన్ని నిర్మాణానికి అనుకూలంగా తీర్చిదిద్దింది.

తాజాగా కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టింది. స్పిల్ వేలో మూడు లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాల్సి ఉంది. స్పిల్ ఛానల్ లో 5.3 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాలి. అయితే స్పిల్ చానల్ లో నీటి నిల్వ ఎక్కువగా ఉండటంతో నీరు తగ్గిన తరువాత మేఘా ఇంజనీరింగ్ అక్కడ పనులు చేపట్టనుంది. రాక్ ఫిల్ డ్యామ్ లో 1. 50 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులను చేయాల్సి ఉంది. ఈ పనులను వచ్చే సీజన్లో అంటే 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని కంపెనీ చెబుతోంది. స్పిల్ వే పనులు 2020 జూన్ నాటికి పూర్తి చేస్తామని వివరించారు.

Next Story
Share it