Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన

పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ టూర్ కు రెడీ అయిపోయారు. డిసెంబర్ 1 నుంచి ఇది ప్రారంభం కానుంది. తాజాగా జనసేన విశాఖపట్నంలో ‘లాంగ్ మార్చ్’ పేరుతో భవన నిర్మాణ కార్మికుల సమస్యను లేవనెత్తింది. ఇప్పుడు రాయలసీమ సమస్యలపై ఫోకస్ పెడుతూ పవన్ కళ్యాణ్ చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. రాయలసీమ జిల్లాల సమస్యలపై రైతాంగం, మేధావులతో పలు చర్చలు చేపడతారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనలో, సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చడంలో పాలక పక్షం చూపిస్తున్న నిర్లక్ష్యం మూలంగా ఇబ్బందులు పడుతున్న వారి ప్రతినిధులను పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో కలుసుకొని వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు.

Next Story
Share it