సామజవరగమన పాటకు ‘పది లక్షల లైక్స్’
అల..వైకుంఠపురములో సూపర్ హిట్ అయిన సాంగ్ ‘సామజవరగమన’. ఈ పాట టాలీవుడ్ లో ఇప్పుడు మరో కొత్త రికార్డు నమోదు చేసింది. తొలిసారి ఏకంగా ఈ పాటకు పది లక్షల లైక్స్ రావటం విశేషం. వ్యూస్ మాత్రం ఇంకా దుమ్మురేపుతూనే ఉన్నాయి. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. యూట్యూబ్‌లో వన్ మిలియన్ లైక్‌లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. టాలీవుడ్‌లో ఓ సినిమాకు సంబంధించిన ట్రైలర్/టీజర్/వీడియో సాంగ్‌కు ఇన్ని లైక్‌లు రావడం ఇదే ప్రథమం కావడం విశేషం.
అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. లాంగ్ గ్యాప్ తరువాత బన్నీ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, సాంగ్స్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో సుశాంత్, సునీల్, నవదీప్, టబు, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=Thf60JU8E98