Telugu Gateway
Cinema

అల..వైకుంఠపురములో మూడవ పాట

అల..వైకుంఠపురములో మూడవ పాట
X

అల్లు అర్జున్ కొత్త సినిమా ఎలా ఉంటుంది అన్న సంగతి తేలాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే. కానీ ఈ లోగానే ఈ సినిమాలోని పాటలు మాత్రం దుమ్మురేపుతున్నాయి. అల..వైకుంఠపురములో సినిమా నుంచి ఇఫ్పటికే వచ్చిన రెండు పాటలు..సామజవరగమన, రాములో రాములా పాటలు యూట్యూబ్ లో రికార్డులు నమోదు చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. అలా ఉన్నాయి మరి ఆ పాటలు. ఇప్పుడు ఇదే సినిమాకు సంబంధించి మూడవ పాట టీజర్ వచ్చింది. అదే ‘ ఓ మైగాడ్ డాడీ’ అంటూ సాగే పాట. అయితే ఇందులో అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హలు సందడి చేశారు.

చిల్డ్రన్స్ డే కావటంతో చిత్ర యూనిట్ వీరి క్యూట్ డ్యాన్స్ లతో వీడియోను విడుదల చేసింది. ఓ మై గాడ్ డాడీ పూర్తి పాట మాత్రం నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ సినిమా కావటంతో దీనిపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ముందు విడుదలైన రెండు పాటలతో పోలిస్తే ఈ పాట కొంచెం స్లోగా ఉన్నట్లు కన్పిస్తుంది. పూర్తి పాట విడుదల అయితే కానీ అసలు విషయం తెలియదు. సామజవరగమన, రాములో రాములా మాత్రం అదరగొడుతున్నాయనే చెప్పాలి.

https://www.youtube.com/watch?v=L0C5OcTMpTM&feature=emb_logo

Next Story
Share it