అల..వైకుంఠపురములో...ఓ మైగాడ్ ఫుల్ సాంగ్
BY Telugu Gateway22 Nov 2019 6:07 PM IST

X
Telugu Gateway22 Nov 2019 6:07 PM IST
అల్లు అర్జున్ యమా దూకుడు మీద ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన సామజవరగమన, రాములో..రాములా పాటలు దుమ్మురేపుతున్నాయి. అదే జోష్ లో ‘ఓమైగాడ్ డాడీ’ ఫుల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డె నటిస్తోంది. తొలి రెండు పాటలతో పోలిస్తే మూడవ పాటలో జోష్ కాస్త తగ్గిందనే చెప్పాలి.
‘నా స్టోరీ చెప్పలేను. నా బాధకు అంతు లేదు. ఈ డాడీలందరూ ఎందుకింత పీక్కుతింటున్నారు. మాట విన్పించుకోరు..అసలు అర్ధం చేసుకోరు’ అంటూ సాగుతుంది ఈ పాట. తొలి రెండు పాటలు రికార్డులు క్రియేట్ చేశాయి. మరి ఈ మూడవ పాట ఏ మేరకు సంచనాలు నమోదు చేస్తుందో వేచిచూడాల్సిందే. అల..వైకుంఠపురములో సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.youtube.com/watch?v=JnxokaXq6TM
Next Story