Telugu Gateway
Cinema

అనుష్క ‘నిశ్శబ్దం’ టీజర్ విడుదల

అనుష్క ‘నిశ్శబ్దం’ టీజర్ విడుదల
X

చాలా కాలం తర్వాత మళ్ళీ అనుష్క సందడి మొదలైంది. ఆమె నటిస్తున్న ‘నిశ్శబ్దం’ టీజర్ విడుదల అయింది. గురువారం అనుష్క పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసింది. అనుష్క, మాధవన్ ఓ విహారయాత్రకు వెళ్ళగా అక్కడ ఏదో ప్రమాదం జరిగినట్లు చూపించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

భాగమతి తర్వాత అనుష్క చేస్తున్న సినిమా ఇదే కావటంతో ఆమె అభిమానులు దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. కోన వెంకట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తుండగా..దీనికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=34Il89EnTQY

Next Story
Share it