అశోక్ గల్లాకు జోడీగా నిధి అగర్వాల్
హీరోయిన్ నిధి అగర్వాల్ అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటించనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా కొత్త సినిమాకు శ్రీకారం చుట్టనున్నారు. నవంబర్ 10న హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పలువురు సినీ ప్రముఖు ల సమక్షంలో ఈ సినిమాను భారీ ఎత్తున ప్రారంభించనున్నారు. ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' వంటి సూపర్‌హిట్ చిత్రంలో నటించిన నిధి అగర్వాల్‌ను హీరోయిన్‌గా చిత్ర యూనిట్ ఖరారు చేసింది.
అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.