Telugu Gateway
Andhra Pradesh

లాంగ్ మార్చ్ పై దుష్ప్రచారం

లాంగ్ మార్చ్ పై దుష్ప్రచారం
X

కొంత మంది నేతలు కావాలనే జనసేన తలపెట్టిన ‘లాంగ్ మార్చ్’పై దుష్ప్రచారం చేస్తున్నాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటారని అన్నారు. అందులో భాగంగానే తెలంగాణలో కూడా యురేనియం సమస్యపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరితో మాట్లాడామన్నారు. భవన నిర్మాణ కార్మికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారని..వారి సమస్యలను గుర్తించే జనసేన లాంగ్ మార్చ్ కార్యక్రమం తలపెట్టిందని వివరించారు.

అదే సమయంలో లాంగ్ మార్చ్ కు రాష్ట్రంలోని అన్ని పార్టీలను కలుపుకుని పోయేందుకు పార్టీల నేతలందరికీ పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి ఆహ్వానించారన్నారు. ప్రజలపక్షాన నిలబడుతూ..ప్రజల కోసం పోరాటం చేయాలన్నదే జనసేన లక్ష్యమన్నారు. ఎన్ని అవాంతరాలు కల్పించిన విశాఖపట్నంలో జనసేన లాంగ్ మార్చ్ ను ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడుతూ ముందుకు సాగుతున్న సమయంలో ఏపీలో తీవ్రమైన ఇసుక సమస్య ఉందని..భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందనే ఈ సమస్యను టేకప్ చేసినట్లు తెలిపారు.

Next Story
Share it