తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా లక్ష్మీపార్వతి
BY Telugu Gateway6 Nov 2019 7:41 PM IST
X
Telugu Gateway6 Nov 2019 7:41 PM IST
ఏపీలో మరో నామినేటెడ్ పోస్టు నియామకం జరిగింది. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతికి కీలక పదవి దక్కింది. ఆమెను తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీ పార్వతి తెలుగు విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. 2000 సంవత్సరంలో ఆమె తెలుగు సాహిత్యంలో ఎంఏ పూర్తి చేశారు.
Next Story