Telugu Gateway
Andhra Pradesh

కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
X

ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, మాజీ మంత్రి ఉమా మహేశ్వరరావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకుని..వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబా ఇఫ్పుడు నీతులు చెప్పేది అని ప్రశ్నించారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బహిరంగ వేదికలపై జగన్మోహన్ రెడ్డి ని ఇష్టానుసారం తిడుతుంటే వెకిలినవ్వులు నవ్వి...పైశాచిక ఆనందం పొందలేదా? అని ప్రశ్నించారు. ఇంకా సీఎం జగన్ వల్లభనేని వంశీకి కండువా కప్పలేదన్నారు. సన్నబియ్యం ఇస్తానన్న సన్నాసి ఏమి చేయలేదు అంటూ ఉమా చేసిన వ్యాఖ్యలపై కూడా కొడాలి నాని తీవ్ర స్థాయిలో స్పందించారు. ఉమా లుచ్చాగాడు. అన్న చస్తే రాజకీయాల్లోకి వచ్చాడు. వదిన అడ్డం పడుతుందని..వదినను కూడా చంపావు. చంద్రబాబు లుచ్చా...నువ్వు లుచ్చా..మీ ఇద్దరూ కలసి నన్ను అడుగుతారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పప్పు రోడ్డు రోలర్ లా పార్టీని తొక్కేస్తాడు..అందులో ఉంటే నలిగిపోతాం అని ఎటు వాళ్ళు అటుదూకేస్తున్నారు. నువ్వు పిలిచినా ఎమ్మెల్యే లు రాకపోతే ఇసుక దీక్షతో పరువు తీసుకున్నావు అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్‌ కుటుంబం గురించి పిచ్చిగా మాట్లాడితే.. బాబు కుటుంబ బండారాన్ని బయటపెడతానన్నారు. జగన్‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదని, జగన్‌ చిటికేస్తే ప్రతిపక్ష హోదా కాదు.. ఏకంగా టీడీపీని తీసుకొచ్చి స్టోర్‌ రూమ్‌లో పెట్టిస్తామంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు డ్రామాలు 40 ఏళ్లుగా చూస్తున్నారని, దేవినేని, యనమల లాంటి బ్రోకర్లతో మాట్లాడించొద్దంటూ మండిపడ్డారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ వల్లే టీడీపీలో సంక్షోభం ఏర్పడిందన్నారు. ఇసుక దీక్ష చేస్తే 23 మంది ఎమ్మెల్యేలకు 9 మందే వచ్చారని అయినా హిట్ అని చెప్పుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ‘టీడీపీలో పోటీ చేయొద్దని దేవినేని అవినాష్‌కు ముందే చెప్పా.

చంద్రబాబు కసాయిలాంటివాడు...మోసం చేస్తాడని చెప్పా. నాపై ఓడిపోతాడని తెలిసినా అవినాష్‌ను గుడివాడలో నిలబెట్టారు. అవినాష్‌ ఓడిపోయాక చంద్రబాబు అతడిని పురుగులా చూశాడు. కాంగ్రెస్‌ను చంద్రబాబు ఎందుకు వదిలారో చెప్పాలి. మరి కేసులకు భయపడి ఎంపీలు బీజేపీలోకి వెళ్లినా చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదు. కులాల గురించి ఎక్కువగా మాట్లాడేది పవన్‌ కల్యాణే. ఆయన ఇక డ్రామాలు ఆపితే మంచిది. కులాలు, మతాలపై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించామని ఆరోపిస్తున్నారు. వరదలున్నప్పుడు ఇసుక ఎవరైనా తీయగలుగుతారా?. ఇసుక కొరతకు సిమెంట్‌ రేట్లకు సంబంధం ఏంటి. ఇక మీ పిల్లలందరూ ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్నారు. పేదల పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌ మీడియంలో చదవకూడదా? అని ప్రశ్నించారు.

Next Story
Share it