చంద్రబాబు నిష్ట దరిద్రుడు..కొడాలి నాని
ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలో చంద్రబాబు పర్యటనపై ఆయన స్పందించారు. ఐదేళ్ళలో ఒక్క శాశ్వత కట్టడం నిర్మించని చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని అమరావతిలో పర్యటిస్తున్నారని కొడాలి నాని ధ్వజమెత్తారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను గాలికి వదిలేసిన బాబు ఇప్పుడు నేల గుర్తొచ్చి ముద్దులు పెడుతున్నాడని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ఇన్నాళ్లు గ్రాఫిక్స్ ను ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడని, అధికారం పోయాక ప్రజలు గూబ గుయ్యమనించారని వ్యాఖ్యానించారు. రైతులను మోసం చేసినందుకు ఈ రోజు చెప్పులేసి తరిమి కొట్టారని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు నిష్ట దరిద్రుడని, అందుకే రాజధానిలో మూడు నియోజకవర్గాల్లో ప్రజలు ఓడించారని విమర్శించారు. రైతులు, దళితుల నుంచి భూములు కొట్టేసిన గుండాలు, రౌడీలతో వచ్చి చంద్రబాబు రాజధానిలో తిరుగుతున్నారని మంత్రి విమర్శించారు.