Telugu Gateway
Cinema

కాజల్ అక్కడ కూడా కాలుపెట్టింది

కాజల్ అక్కడ కూడా కాలుపెట్టింది
X

కాజల్ అగర్వాల్. దశాబ్దం దాటినా తెలుగులో హవా నడిపిస్తోంది. ఒక్క తెలుగే కాదు..తమిళంతోపాటు పలు భాషల్లో నటించి తన సత్తా చాటుతోంది. కాజల్ పని అయిపోయింది..ఇక ఛాన్స్ లు కష్టమే అని వార్తలు వచ్చాయంటే చాలు..ఆమెకు అవకాశాలు కూడా అలా పరుగెత్తుకుంటూ వస్తాయి. మళ్ళీ హవా నడిపిస్తారు. గతంలో ఎన్నోసార్లు ఇది నిరూపితం అయింది. కాజల్ అగర్వాల్ ఇప్పటికే పలు భాషల్లో నటించినా ఇప్పటివరకూ కన్నడ సినిమా చేయలేదు. ఇప్పుడు ఆ కోరిక కూడా తీరిపోతోంది. ఈ చందమామ ఇఫ్పుడు ఓ కన్నడ సినిమాలో నటిస్తోంది.

కన్నడంతో సంచలన నటుడిగా ముద్రవేసుకున్న ఉపేంద్రతో జతకడుతోంది. కబ్జా అనే చిత్రంలో ఈ జంట నటిస్తున్నారు. తమిళంలో కమలహాసన్‌కు జంటగా శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌–2 చిత్రంలో నటిస్తోంది. శాండిల్‌వుడ్‌ ఎంట్రీ గురించి కాజల్‌ మాట్లాడుతూ తాను నటించే ప్రతి చిత్రాన్ని తొలి చిత్రంగానే భావిస్తానని చెప్పింది. ఇప్పుడు కన్నడంలో మొదటి సారి నటిస్తున్నాను. ఈ అనుభవం కొత్తగా ఉంది అని పేర్కొంది. ఈ చిత్రాన్ని ఏడు భాషల్లో విడుదల చేయనున్నారని వెల్లడించింది.

Next Story
Share it