Telugu Gateway
Andhra Pradesh

జగన్ ఆరు నెలల్లో 25 వేల కోట్లు అప్పులు చేశారు

జగన్ ఆరు నెలల్లో 25 వేల కోట్లు అప్పులు చేశారు
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆరు నెలలు పూర్తి చేసుకున్న సంరద్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ ఆరు నెలల వ్యవధిలో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అది అప్పుల్లో రికార్డు సృష్టించడమే అని వ్యాఖ్యానించారు. ఆరు నెలల్లో దాదాపు 25 వేల కోట్ల రూపాయలు అంటే నెలకు సుమారు మూడున్నర వేల కోట్ల అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనీ చేయలేదన్ను. ఒక్క ఆగస్టులోనే ఐదు సార్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇచ్చానని తిరిగి తనపైనే విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

పాలన చేతకాకపొతే సలహాలు తీసుకోవాలి. అంతేకాని అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా? అని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని అనుకున్నామని, కానీ వైసీపీ ప్రభుత్వం తొలిరోజు నుంచే విధ్వంసకర పాలన మొదలుపెట్టిందని ఆరోపించారు. ప్రజలకు నష్టం, కష్టం కలుగుతున్నప్పుడు ప్రతిపక్షంగా చూస్తూ కూర్చోలేం కాబట్టే బాధితుల పక్షాన అటు న్యాయపోరాటం, ఇటు రాజకీయ పోరాటం చేస్తున్నామని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

Next Story
Share it