టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై ఐటి దాడులు
BY Telugu Gateway20 Nov 2019 10:07 PM IST

X
Telugu Gateway20 Nov 2019 10:07 PM IST
హైదరాబాద్ లో బుధవారం నాడు భారీ ఎత్తున ఐటి దాడులు జరిగాయి. ఓ వైపు సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఇళ్ళు, కార్యాలయాలతోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసంపై కూడా ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కూకట్పల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఐటి సెగ తగిలింది. కూకట్‌పల్లిలోని వెంకట్రావునగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచే అధికారులు సోదాలు చేశారు.
ఎమ్మెల్యే కుమారుడు సందీప్‌రావు డైరెక్టర్‌గా కొనసాగుతున్న ప్రణీత్ హోమ్స్ కంపెనీ కార్యాలయాలతోపాటు,ఎండీ నరేందర్, మరో ఐదుమంది డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాలు జరిగాయి. సోదాల సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. బుధవారం అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story



