కెటీఆర్ తో కపిల్ దేవ్ భేటీ
BY Telugu Gateway25 Nov 2019 3:49 PM IST

X
Telugu Gateway25 Nov 2019 3:49 PM IST
టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సోమవారం ఉదయం హైదరాబాద్ లో తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ తో సమావేశం అయ్యారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కేటీఆర్‌తో సమావేశమైన కపిల్ దేవ్, డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరగబోయే అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్‌కు ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేటీఆర్‌తో కపిల్ దేవ్ చర్చలు జరిపారు. ఈ భేటీలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story