Telugu Gateway
Cinema

హీరో రాజశేఖర్ కు తప్పిన ప్రమాదం

హీరో రాజశేఖర్ కు తప్పిన ప్రమాదం
X

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. కారు టైరు పేలి డివైడర్ ను ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టింది. అయితే రాజశేఖర్ సీటు బెల్ట్ పెట్టుకుని ఉండటంతో బెలూన్లు ఓపెన్ అయ్యాయి. దీంతో చిన్న గాయాలతో రాజశేఖర్ ప్రమాదం బారి నుంచి తృటిలో తప్పించుకున్నట్లు అయింది. గతంలోనూ ఓ సారి రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. రామెజీఫిల్మ్‌ సిటీ నుంచి తన కారులో ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తర్వాత రాజశేఖర్ మరో కారులో వెళ్లిపోయినట్టు సమాచారం. అయితే ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో రాజశేఖర్ ఒక్కరే ఉన్నారు.

Next Story
Share it