Telugu Gateway
Cinema

‘జార్జిరెడ్డి’ మూవీ రివ్యూ

‘జార్జిరెడ్డి’ మూవీ రివ్యూ
X

ఉస్మానియా యూనివర్శిటీ. ఒకప్పటి యువతకు అందులో చదువుకోవటం ఓ కల. ఆ కల అందుకోవటానికి చాలా కష్టపడేవారు. ఇప్పటి యువతకూ..70, 80, 90వ దశాబ్దాల నాటి యువతకు మధ్య ఎంతో తేడా ఉండేది. ఇఫ్పటి యూనివర్శిటీలు..కాజీల్లోని యువతకు చదువు..కెరీర్ తప్ప మరో అంశం ఏదీ పట్టదు. కానీ అప్పట్లో అలా కాదు. ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్ధులు అంటే చాలా మందిలో చదువుతో పాటు సామాజిక అంశాలు..రాజకీయాలు ప్రతి అంశంపై లోతైన అవగాహన ఉండేది. ఈ సమయంలోనే ‘జార్జిరెడ్డి’ ఉస్మానియా యూనివర్శిటిలోకి అడుగుపెడతాడు. జార్జిరెడ్డి అడుగుపెట్టేనాటికే యూనివర్శిటీలో క్యాంటీన్ లో ఫుడ్ దగ్గర నుంచి ప్రతి విషయంలో ‘గ్రూపుల’ వారీగా తేడాలు ఉండేవి. సంపన్న..అగ్రవర్ణాల పిల్లలకు ఓ ట్రీట్ మెంట్, వెనకబడిన వర్గాలకు ఓ ట్రీమ్ మెంట్. జార్జిరెడ్డి దీన్నే ఎదిరించాడు. అప్పటి నుంచి యూనివర్శిటీలో ఏ సమస్య వచ్చినా అందరూ జార్జిరెడ్డి దగ్గరకే వెళ్ళేవారు. అప్పటికే వేళ్ళూనుకునిపోయి యధేచ్చగా ఇష్టానుసారం చేస్తున్న యూనియన్లకు వ్యతిరేకంగా గళమెత్తుతాడు జార్జిరెడ్డి.

చిన్నప్పటి నుంచి జార్జిరెడ్డిది దూకుడు స్వభావమే. స్కూల్ ద్గరగ నుంచి యూనివర్శిటీ వరకూ అదే పంథా. ప్రస్తుత తరంలో పెద్దగా ఎవరికీ తెలియని ‘జార్జిరెడ్డి’ కథను సినిమాగా తెరకెక్కించాలని నిర్ణయించటమే ఓ పెద్ద సాహసమే అని చెప్పాలి. కానీ దర్శకుడు జీవన్ రెడ్డి సినిమాను పర్పెక్ట్ గా తెరకెక్కించారనే చెప్పాలి. తొలుత యూనివర్శిటీ సమస్యలపై గళమెత్తిన జార్జిరెడ్డి తర్వాత కుళ్లిపోయిన సమాజంలోని సమస్యలపై దృష్టి సారించి దేశంలోని అన్ని యూనివర్శిటీల యువతను ఏకంగా చేయటం..రాజకీయ నాయకులను ఇబ్బందికి గురిచేస్తుంది. అందుకే యూనివర్శిటీలో ట్రాప్ వేసి జార్జిరెడ్డిని హతమార్చుతారు. ఓ గొడవలో కాలేజీ నుంచి సస్పెండ్ అయినప్పుడు యూనివర్శిటీలో చదువుకునే సమయంలో బ్లేడును నోట్లో పెట్టుకుని చేసే విన్యాసాలు..ఫైటింగ్ లో బ్లేడ్ లన ఖర్చీప్ కు కట్టి ఫైటింగ్ చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. 70-80 దశాబ్దాల నాటి విద్యార్ధుల డ్రెస్సింగ్, భాషల విషయంలో కూడా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సినిమా ఫస్టాఫ్ ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా అలా సాగిపోతుంది. సెకండాఫ్ లో మాత్రం కాస్త జోరు తగ్గుతుంది. జార్జిరెడ్డి పాత్ర పోషించిన సందీప్ మాధవ్ తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడనే చెప్పాలి. జార్జిరెడ్డి తల్లి పాత్రలో మరాఠీ నటి దేవిక తన పాత్రకు జీవం పోశారు.

హీరోయిన్‌ ముస్కాన్‌ కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఇక అభయ్‌, యాదమరాజు, పవన్‌, సత్యదేవ్‌, మనోజ్‌ నందం తదితర నటులు తమ పరిధి మేరకు మెప్పించారు. ఈ కథలో ఎన్నో సున్నితమైన అంశాలు ఉన్నా దర్శకుడు ఎక్కడా కూడా ఎవరి మనోభావాలు కించపరచకుండా చక్కగా ప్రజెంట్‌ చేశారు. క్లైమాక్స్ లోనే సినిమాలో భావోద్వేగాలు కన్పిస్తాయి. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్ళింది. పాటలు కూడా ఆకట్టుకునేలా తెరకెక్కించాడు దర్శకుడు. ఎలాంటి గందరగోళం లేకుండా స్క్రీన్‌ ప్లే చాలా చక్కగా ప్రజెంట్‌ చేశారు. ఆ కాలానికి తగ్గటు​ దుస్తులు, సెట్టింగ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఓవరాల్ గా ‘జార్జిరెడ్డి’ ఓ స్పూర్తిదాయక సినిమా.

రేటింగ్. 2.75/5

Next Story
Share it