టీడీపీకి దేవినేని అవినాష్ గుడ్ బై
BY Telugu Gateway14 Nov 2019 3:06 PM IST

X
Telugu Gateway14 Nov 2019 3:06 PM IST
ప్రతిపక్ష టీడీపీకి మరో షాక్. తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తన పదవితోపాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను టీడీపీ కార్యాలయానికి పంపారు. అవినాష్ తో పాటు కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు కూడా టీడీపీ రాజీనామా చేశారు. పార్టీలో సరైన ప్రాతినిథ్యం దక్కలేదని కొంతకాలంగా అవినాష్ అసంతృప్తితో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.అవినాష్ గత ఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత నెలలో ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అవినాష్ అధికార వైైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
Next Story



