Telugu Gateway
Andhra Pradesh

ప్రపంచ శ్రేణి నగరం కట్టడం అంత తేలికా?.బుగ్గన

ప్రపంచ శ్రేణి నగరం కట్టడం అంత తేలికా?.బుగ్గన
X

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఎక్కువ ధరకు చేసిన సంస్థలే ఇప్పుడు ఏపీలో ఇప్పుడు తక్కువ ధరకు పనులు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబునాయుడు ప్రశంసించిన సంస్థలకే పనులు కట్టబెడుతున్నామంటూ తెలిపారు. చంద్రబాబు జమానాలో అప్పులు భారీగా పెరిగిపోయాయని తెలిపారు. బుగ్గన గురువారం నాడు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి వరల్డ్ క్లాస్ సిటీ..వరల్డ్ క్లాస్ సిటీ అంటున్నారు అంత సులభమా నగరం కట్టేది? అని ప్రశ్నించారు. హైదరాబాద్ కు 400 సంవత్సరాలనపైన చరిత్ర ఉందన్నారు. అసలు చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నాడు. ఏమి చెబుతున్నారు అని ప్రశ్నించారు. హైదరాబాద్ ను కూడా తానే కట్టానని చంద్రబాబు చెప్పుకుంటారు..మరి కులీ కుత్ బ్ షా ఏమి చేశాడు.

నాలుగు రోడ్లు వేస్తే నగరం అయిపోతుందా? అని ప్రశ్నించారు. హైదరాబాద్, ముంబయ్, చెన్నయ్ వంటి సిటీలు ఈ స్థాయికి రావటానికి ఎంత సమయం పట్టింది అని బుగ్గన వ్యాఖ్యానించారు. కమిటీలు ఎందుకు వేస్తున్నారని కొంత మంది ప్రశ్నిస్తున్నారు..గత ప్రభుత్వం అవినీతి చేస్తే చర్యలు తీసుకోకుండా ఉంటామా అని ఎద్దేవా చేశారు. కమిషన్ల కోసమే పలు పనులను ఎక్కువ మొత్తానికి అప్పగించారని ఆరోపించారు. జెండా పంగడ పేరుతో ఎక్కడపడితే అక్కడ రంగులువేసింది ఎవరు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దేశానికి తానే ఇంగ్లీష్ నేర్పినట్లు మాట్లాడతారని..ఆయన మాటలు చూస్తే మాత్రం షాక్ కు గురికావాల్సిందే అన్నారు. విద్యుత్ పీపీఏలపై కేంద్రం అభిప్రాయం కేంద్రానికి..రాష్ట్రం కోణం రాష్ట్రానిది అని తెలిపారు. రాష్ట్రంపై భారం తగ్గించేందుకే తాము కృషి చేస్తున్నామని..కొన్ని సంస్థలు రేట్లు తగ్గించుకోవటానికి కూడా ముందుకొస్తున్నాయని తెలిపారు.

Next Story
Share it