Telugu Gateway
Cinema

నితిన్ ‘చింపేశాడు’

నితిన్ ‘చింపేశాడు’
X

అంతే...నిజంగానే నితిన్ చింపేశాడు. ముందు హీరోయిన్ రష్మిక అలా నడుస్తూ ఉంటుంది. వెనక నితిన్ ఆమె నడుమును పట్టుకునే ప్రయత్నం చేస్తూ వెళతాడు. రష్మిక సడన్ గా వెనక్కి తిరిగితే నితిన్ చేతికి రష్మిక నడుము చిక్కుతుంది. కళ్ళతోనే రష్మిక ఏంటి అని అడిగితే..నితిన్ కూడా అదే తరహాలో ‘చింపేశావ్’ అని చెబుతాడు. కానీ ఏదీ మాటల్లో ఉండదు. ఇది అంతా ఎక్కడ అంటారా?.

భీష్మ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. ఇందులో హీరో నితిన్ డైలాగ్ కూడా ఫుల్ కామెడీగా ఉంది. ‘నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదే. కన్పిస్తూనే ఉంటుంది. కానీ క్యాచ్ చేయలేం’ అంటూ చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది. భీష్మ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్, రష్మికల కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

https://www.youtube.com/watch?v=oov1Le1whD4

Next Story
Share it