Telugu Gateway
Cinema

‘రూలర్’ షూటింగ్ పూర్తి

‘రూలర్’ షూటింగ్ పూర్తి
X

బాలకృష్ణ డిసెంబర్ లో సందడి చేయటానికి రెడీ అయిపోయారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న సినిమా రూలర్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా సోనాల్ చౌహన్, వేదికలు నటించారు. సీ. కళ్యాణ్ చిత్ర నిర్మాత. ఈ సినిమా డిసెంబరు 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు శక్తివంతమైన పాత్రల్లో నటించారు. త్వరలో పాటల లిరికల్‌ వీడియోను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం వెల్లడించింది.

Next Story
Share it