Telugu Gateway
Cinema

అర్జున్ సురవరం ట్రైలర్ విడుదల

అర్జున్ సురవరం ట్రైలర్ విడుదల
X

పలు అవాంతరాలను అధిగమించి ‘అర్జున్ సురవరం’ విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసింది. యువ హీరో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీకి టి.సంతోష్‌ దర్శకత్వం వహించగా.. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్‌ ఎల్‌ ఎల్‌ పి పతాకంపై రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మించారు. ఈ సినిమాలో జర్నలిస్టుగా కనిపించనున్న నిఖిల్‌.. నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసే ఓ ముఠా గుట్టురట్టు చేసినట్లు ట్రైలర్ లో కనిపిస్తోంది.

అర్జున్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి అంటూ బ్యాగ్రౌండ్‌లో వచ్చే డిమాండ్‌తో ట్రైలర్‌ ప్రారంభమై అందరిలోనూ ఆసక్తి రేకిత్తిస్తోంది. ‘ఈ కోపం నువ్వు నిజం చెప్పనందకు కాదు.. నువ్వే నిజం కానందుకు, ఒక బాధితుడిలా కాదు.. ఒక రిపోర్టర్‌లా ఆలోచించాలి, వాడికి కావాల్సింది ఎవిడెన్స్‌.. తప్పకుండా వెతుక్కుంటూ వస్తాడు, ప్రతీ ఒక్క స్టూడెంట్‌కు ఇచ్చే మెసేజ్‌ ఇదే.. ఇది మన ప్రాబ్లమ్‌ మనమే సాల్వ్‌ చేసుకోవాలి’అంటూ ట్రైలర్‌లో వచ్చే డైలాగ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, ‘వెన్నెల’ కిషోర్, తరుణ్‌ అరోరా, నాగినీడు, సత్య, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు నటించారు.

https://www.youtube.com/watch?time_continue=86&v=bUJ2D3sEDe0&feature=emb_logo

Next Story
Share it