Telugu Gateway
Cinema

‘అర్జున్ సురవరం’ మూవీ రివ్యూ

‘అర్జున్ సురవరం’ మూవీ రివ్యూ
X

వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ‘అర్జున్ సురవరం’ సినిమా ఎట్టకేలకు విడుదలైంది. హీరో నిఖిల్ సిద్దార్ధ్ ముందు నుంచి చెబుతున్నట్లు నిజంగానే ఈ సినిమా బాగుంది. యువ హీరోగా ఎన్నో ప్రయోగాలు చేస్తున్న నిఖిల్ ఈ సినిమా ద్వారా ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మధ్య కాలంలో జర్నలిస్టులను నెగిటివ్ చూపిస్తేనే సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఈ విషయాన్ని పలు సినిమాలు ప్రూవ్ చేశాయి కూడా. కానీ జర్నలిస్ట్ లను చెడుగానే కాదు... మంచిగా చూపిస్తూ కూడా హిట్ కొట్టొచ్చు అని నిరూపించాడు నిఖిల్ సిద్ధార్ధ్. అలా హిట్ కొట్టిందే అర్జున్ సురవరం మూవీ. అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్) తండ్రి జర్నలిస్ట్. దూరదర్శన్ లో పనిచేస్తూ తన కొడుకు అసలు జర్నలిజంలోకి రాకూడదని కోరుకుంటాడు. కానీ తండ్రికి తెలియకుండా అర్జున్ టీవీ99 ఛానల్ లో పనిచేస్తూ బీబీసీలో ఉద్యోగం సాధించటమే లక్ష్యంగా పనిచేస్తుంటాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా ఉన్న అర్జున్ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఓ గ్రూపుతో కలసి బ్యాంకులను 13 కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో అరెస్ట్ అవుతాడు. మరి నిజంగా అర్జున్ కు ఫేక్ సర్టిఫికెట్ల స్కామ్, ఎడ్యుకేషన్ లోన్ల స్కాంలో సంబంధం ఉందా?. దీని వెనక ఉంది ఎవరు? ఈ ఛాలెంజింగ్ టాస్క్ ను అర్జున్ ఎలా పూర్తి చేశాడు అన్నదే సినిమా.

సినిమా అంతా నిఖిల్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, సత్య క్యారెక్టర్ల చుట్టూనే తిరుగుతుంది. ఫస్టాఫ్ లో అక్కడక్కడ కామెడీని మిక్స్ చేస్తూ స్టోరీని పర్పెక్ట్ గా నడిపించాడు దర్శకుడు టీ ఎన్ సంతోష్. సెకండాఫ్ లో కామెడీ డోస్ కాస్త తగ్గినా కూడా ఎక్కడా బోర్ కొట్టదు. కామెడీ కూడా కథలో బాగంగానే వచ్చినట్లు ఉంటుంది తప్ప...ఎక్కడా అతికించినట్లు అన్పించదు. జర్నలిస్ట్ లో పాత్రలో నిఖిల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కేసులు లేని లాయర్ గా వెన్నెల కిషోర్ కామెడీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్, విద్యుల్లేఖ రామన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు సరదాగా ఉన్నాయి. కథలో సీరియస్ నెస్ ఉండటంతోపాటు..ఫేక్ సర్టిఫికెట్ లతో ఉద్యోగాలు పొందిన వారి వల్ల సమాజానికి జరిగే నష్టం గురించి కూడా దర్శకుడు కథలో పర్పెక్ట్ గా ప్రజంట్ చేశాడు. ఓవరాల్ గా చూస్తే అర్జున్ సురవరం ‘పైసా వసూల్’ మూవీ.

రేటింగ్. 3/5

Next Story
Share it