నీరబ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించిన ఎల్వీ
BY Telugu Gateway6 Nov 2019 11:04 AM IST

X
Telugu Gateway6 Nov 2019 11:04 AM IST
ఊహించని రీతిలో బదిలీ వేటు పడిన ఎపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఇన్ ఛార్జి సీఎస్ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ కు అప్పగించారు. బుధవారం ఉదయం ఎల్వీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇక ఎల్వీ సుబ్రమణ్యం బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరక్టర్ జనరల్ గా వ్యవహరించనున్నారు.
అయితే త్వరలోనే కొత్త సీఎస్ నియామకం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. సీఎం జగన్ , సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మధ్య కొన్ని అంశాలపై బేధాభిప్రాయాలు రావటంతో ఆయన్ను సీఎస్ పదవి నుంచి తప్పించారు. ఈ వ్యవహారం ఏపీలోని అధికార వర్గాల్లో పెద్ద కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Next Story



