Telugu Gateway
Politics

బిజెపిలోకి అన్నపూర్ణమ్మ

బిజెపిలోకి అన్నపూర్ణమ్మ
X

తెలంగాణలో బిజెపిలోకి రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, ఆమె తనయుడు బాల్కొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ డాక్టర్ మల్లికార్జున రెడ్డి శనివారం నాడు బీజేపీ లో చేరారు. న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యాలయంలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షడు జేపీ నడ్డా వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఈ కార్యక్రమం పాల్గొన్నారు.

అనంతరం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ అన్నపూర్ణమ్మ, మల్లికార్జున్ రెడ్డి ల చేరిక తో బాల్కొండ, ఆర్మూర్ సెగ్మెంట్ ల లో పార్టీ బలపడుతుందని అన్నారు. ఆన్నపూర్ణమ్మ చేరిక తెలంగాణ బీజేపీ లో మంచి పరిణామం అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా లు దేశం కోసం తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు చూసి బీజేపీ లో చేరుతున్నామని అన్నపూర్ణమ్మ అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా బీజేపీ లో చేరుతున్నట్టు వెల్లడించారు.

Next Story
Share it