Telugu Gateway
Cinema

శ్రీరెడ్డి సంచలన ప్రకటన

శ్రీరెడ్డి సంచలన ప్రకటన
X

శ్రీరెడ్డి. ఆ పేరే సంచలనం. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి గొంతెత్తి పరిశ్రమను కొంత కాలం పాటు కలవరానికి గురిచేసిన నటి. కాస్టింగ్ కౌచ్ సమస్య గురించి ఎంత ప్రశ్నించినా ఎవరూ నోరెత్తకపోవటంతో ఏకంగా మా ఆఫీసులో అర్ధనగ్న ప్రదర్శన చేసి దేశవ్యాప్త మీడియా అటెన్షన్ తన వైపు తిప్పుకునేలా చేసింది. ఎప్పటిలాగానే దీనిపై హడావుడి కొన్నిరోజుల పాటు సాగింది..తర్వాత మళ్ళీ అంతా మామూలే. ప్రస్తుతం శ్రీరెడ్డి సినిమాల్లో నటించటంతో అప్పుడప్పుడు వివాదస్పద పోస్టులు పెడతూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె ఓ సంచలన ప్రకటన చేసింది. అదేంటి అంటే ఆమె త్వరలోనే రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు పేర్కొంది.

తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చి ఓ అంశంపై వివరణ ఇచ్చారు. కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్‌పై శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చేసినట్లు చెబుతున్న కామెంట్ ఒకటి అక్కడ పెద్ద దుమారమే రేపింది. దీనిపై ఉదయనిధి మారన్ అభిమానులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆమె మీడియా ముందుకు వచ్చారు. అసలు ఉదయ నిధి మారన్ పై తాను ఎలాంటి కామెంట్ చేయలేదని..తాను ఆయన్ను ఎప్పుడూ కలవలేదని తెలిపారు. ఎవరో తన పేరు చెడగొట్టాలనే ఉద్దేశంతో ఇలా చేశారని తెలిపారు. కొంత మంది తన పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి హడావుడి చేస్తున్నారని దీనిపై ఫిర్యాదు కూడా చేశానని తెలిపారు.

Next Story
Share it