Telugu Gateway
Cinema

సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి ఫస్ట్ లుక్

సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి ఫస్ట్ లుక్
X

మహేష్ బాబు హీరీగా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో సుదీర్ఘ విరామం తర్వాత విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇందులో ఆమె పాత్ర పేరు భారతి. దీపావళి శుభాకాంక్షలతో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి విజయశాంతి ఫస్ట్ లుక్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అనిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రంలో మహేష్‌ కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్ర‌లో మహేష్‌ ఒదిగిపోయారని, సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ కు సంక్రాంతికి డబుల్‌ ధమాకా అని చిత్ర యూనిట్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల కానుంది. విజయశాంతి ఫస్ట్‌ లుక్‌పై హీరో రానా స్పందించాడు. ‘తెరపై ఆమెను చూడటం అద్భుతంగా ఉంది’ అంటూ కామెంట్‌ చేశాడు.

Next Story
Share it