‘పెళ్లి’పై విజయదేవరకొండ కామెంట్
BY Telugu Gateway27 Oct 2019 5:01 PM IST

X
Telugu Gateway27 Oct 2019 5:01 PM IST
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ దేవరకొండ బిగ్ బాస్ లో సందడి చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న విజయదేవరకొండను షో నిర్వాహకుడు అక్కినేని నాగార్జున ఓ ప్రశ్న అడిగారు. ప్రతి ఆరు నెలలకు ఓ సారి నీ పెళ్ళి గురించి రకరకాల రూమర్లు వస్తుంటాయి..ఏంటి సంగతి అంటూ ప్రశ్నించారు.
‘ నా అమలను ఇంకా వెతుక్కోవాలి సార్.ఇంకా దొరకలేదు’ అంటూ వ్యాఖ్యానించారు. దీనికి నాగార్జున కూడా అంతే సరదాగా బదులిస్తూ ‘నీకు నీ అమల త్వరగా దొరకాలని కోరుకుంటున్నా’నని వ్యాఖ్యానించారు. విజయ దేవరకొండ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’ నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Next Story