‘వెంకీమామ’ సందడి పెరిగింది
BY Telugu Gateway8 Oct 2019 11:46 AM GMT
X
Telugu Gateway8 Oct 2019 11:46 AM GMT
‘గోదావరిలో ఈత నేర్పాను, బరిలో ఆట నేర్పాను.. ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా.. రారా అల్లుడు’అంటూ వెంకటేష్ చేసిన సందడి ఆకట్టుకుంటోంది. దసరా సందర్బంగా వెంకీమామ సినిమాకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింద చిత్ర యూనిట్. ఈ సినిమా షూటింగ్ ఒక పాట మినహా మిగతా చిత్రీకరణ పూర్తయిందని సమాచారం.
ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు చివరి వారంలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. దసరాకు మందు రోజు విడుదల చేసిన కొత్త లుక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లో రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=5BIY39Ufkz0
Next Story