Telugu Gateway
Telangana

ఆర్టీసీ సమ్మెపై ముందుకే!

ఆర్టీసీ సమ్మెపై ముందుకే!
X

తెలంగాణలో ఆర్టీసి సమ్మె ఆగే సూచనలు కన్పించటంలేదు. ముఖ్యమంత్రి కెసీఆర్ నియమించిన ఉన్నతాధికారుల కమిటీతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. అధికారుల కమిటీ నుంచి నిర్ధిష్ట హామీలు ఏమీ రానందున అక్టోబర్ 5 నుంచి సమ్మెకే నిర్ణయించుకున్నామని ఆర్టీసి ఐక్యకార్యాచరణ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. కమిటీ ఏర్పాటు ఓకే అయినా..గతంలో కూడా ఇలాంటి కమిటీలు ఎన్నో వేశారన్నారు. తాము కూడా సమస్యను పరిష్కరిస్తే పండగ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయటానికి సిద్ధమన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో పాటు తమ డిమాండ్లు అన్నీ పరిష్కరించాల్సిందేనని కార్మికుల సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

అయితే అధికారుల కమిటీ మాత్రం ప్రభుత్వానికి తమ నివేదిక ఇవ్వటానికి కొంత సమయం పడుతుందని చెబుతోంది. రెండు మూడు అంశాలు మినహా మిగిలిన డిమాండ్లు ప్రభుత్వం తలచుకుంటే పెద్ద సమస్యేమీ కాదని నేతలు చెబుతున్నారు. మరి సర్కారు రాబోయే రోజుల్లో కొన్ని హామీలను అయినా అమలు చేసి సమ్మెను తప్పిస్తుందా? లేక ఎవరి వారు మొండి పట్టుదలతో ఉండి సమస్యను జఠిలం చేస్తారా? అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it