Telugu Gateway
Politics

హుజూర్ నగర్ లో కారు జోరు

హుజూర్ నగర్ లో కారు జోరు
X

కాంగ్రెస్ కు తెలంగాణలో మరో షాక్. సిట్టింగ్ సీటు హుజూర్ నగర్ కూడా ఆ పార్టీ కోల్పోయింది. ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి భారీ మెజారిటీతో గెలిచే అవకాశం కన్పిస్తోంది. ఓ వైపు ఆర్టీసి సమ్మె ప్రతికూల ప్రభావం ఉంటుందనే అంచనాలను పటాపంచలు చేస్తూ టీఆర్ఎస్ విజయం దిశగా సాగుతోంది. దీంతో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ ఒక్కతాటిపై నిలిచి మరీ కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతిరెడ్డికి మద్దతుగా ప్రచారం చేసినా కూడా ఏ మాత్రం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఎందుకంటే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన దాని కంటే సైదిరెడ్డి భారీ మెజారిటీతో గెలవనుండటం మరో విశేషం.

ఏ దశలోనూ కాంగ్రెస్ పార్టీ హుజూర్ నగర్ లో ఆధిపత్యం చూపించలేకపోయింది. సంప్రదాయంగగా కాంగ్రెస్ కు బలమున్న ప్రాంతాలలోనూ టీఆర్ఎస్ పట్టు సాధించటం విశేషం. ఉదయం 10.15 గంటల వరకూ వచ్చిన ఫలితాల వరకూ చూస్తే టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి 17400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా రెండు రోజుల పాటు ప్రచారం చేసి కెటీఆర్ తన చెల్లిని గెలిపించుకోలేకపోయారని..తాను మాత్రం తన అక్క పద్మావతి రెడ్డిని గెలిపించుకుంటానని వ్యాఖ్యానించారు. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమి చెబుతారో?.

Next Story
Share it