Telugu Gateway
Telangana

ఆర్టీసి సమ్మెకు టీఎన్జీవోల మద్దతు

ఆర్టీసి సమ్మెకు టీఎన్జీవోల మద్దతు
X

ఆర్టీసి సమ్మె విషయంలో కీలక పరిణామం. గత కొన్ని రోజులుగా ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మెకు టీఎన్జీవోలు మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశం అనంతరం తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికులు చేసే నిరసన కార్యక్రమాల్లో తాము కూడా పాల్గొంటామని టీఎన్జీవో నేతలు ప్రకటించారు. ఆర్టీసీ జెఏసీ ఛైర్మన్ అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ ఐదు సంవత్సరాల తరువాత ఇక్కడ సమావేశం అయినం..ఇలాంటి సమయం వస్తది అనుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ సకలజనుల సమ్మెలో పాల్గొన్నాం. 2014 లో ఉద్యమంలో ఏమి ఆశించి ఉద్యమం చేశాం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉరూరికి బస్సులు తిప్పుతాం అనుకున్నాం కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉన్నాయి. రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రావాలి. ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు తక్కువే. కార్మికులు ఎంత కష్ట పడ్డ దానికి ఫలితం జీతం లేదు. తమ సమష్యాల నెరవేర్చుకోవడానికి సమ్మె నోటీసులు ఇచ్చినం అయిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం అమ్మేసింది.

ఆర్టీసీని,ఆర్టీసీ,ఆస్తులను,ఆర్టీసీ ఉద్యోగులను కాపాడుకోవడానికి మాత్రమే సమ్మె చేస్తున్నాం. ఉద్యోగ సంఘాలు అందరూ తమకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా. అనంతరం కారం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిలవాలని కోరారు. ఇద్దరు కార్మికులు చనిపోయిన సంఘటన తమను ఎంతో కలసి వేసింది. క్రింది స్థాయి అందరితో కలిసి చర్చించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగిన సమావేశంలో చాలా మంది ఎన్నో ఆపోహలు వెల్లువెత్తాయి. మేము ఎప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసినప్పుడల్లా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే కలిశాం. తెలంగాణ ఎన్జీవోలు ఉద్యోగుల తో కార్యవర్గ సమావేశం నిర్వహించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను చర్చించాం. రేపు సీఎస్ గారికి కలిసి ఆర్టీసీ కార్మికుల సమస్యలను చర్చిస్తాం. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరతామని తెలిపారు.

Next Story
Share it