Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

అక్టోబర్ 19న తెలంగాణ బంద్

0

ఆర్టీసి సమ్మె వ్యవహారం తీవ్ర రూపం దాల్చుతోంది. సర్కారు ఏ మాత్రం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోవటంతో వారం రోజుల కార్యాచరణను ప్రకటించింది ఆర్టీసీ జెఏసీ.  ఈ జెఏసీ నిర్ణయానికి పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తిరిగి అంతకు ముందు ఉన్న పరిస్థితి ఏర్పడనుంది. వారం రోజుల కార్యాచరణ తర్వాత చివరగా అక్టోబర్ 19న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా వంటావార్పు, 14న అన్ని డిపోల దగ్గర వంటా వార్పు, బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, మానవహారాలు తలపెట్టారు.

- Advertisement -

16న ఐక్య కార్యాచరణ సమితికి మద్దతుగా విద్యార్ధుల ర్యాలీలు, 17న ధూంధాం కార్యక్రమాలు, 18న ద్విచక్ర ర్యాలీలు చేపట్టనున్నారు. చివరగా 19న తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు అధికార టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించనున్నాయి. ఇఫ్పటికే అఖిలపక్షంలో అన్ని పార్టీలు సూత్రప్రాయంగా దీనికి అంగీకరించాయి. తెలంగాణ బంద్ నిర్ణయంతో ఆర్టీసి వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లు అయింది.

 

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.