Telugu Gateway
Telangana

తెలంగాణకు రైళ్ళ కంటే బస్సులే కీలకం

తెలంగాణకు రైళ్ళ కంటే బస్సులే కీలకం
X

ఆర్టీసి సమ్మెపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రైళ్లలో కంటే, బస్ లో నే ప్రయాణాలు ఎక్కువ అని పేర్కొంది. అదిలాబాద్ వంటి అడవి ప్రాంతాల్లో ఉన్న చిన్నారులకు ఆరోగ్య సమస్య ఉంటే వారు వరంగల్, హైదరాబాద్ లకు రావాలంటే బస్ లు తిరగకుండా ఉంటే ప్రభుత్వం ఆ చిన్నారుల చావుకు బాధ్యత తీసుకుంటుందా..అసలే డెంగ్యూ జ్వరాలతో ప్రాణాలు పోతున్నాయని వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు తీరు ఫై హై కోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ను తక్షణమే కోర్టుకు రావాలని హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. వాదనలు హై కోర్ట్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాత్రమే జరుగుతున్నాయని హై కోర్ట్ వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏజీ మాత్రమే వాదనలు వినిపించాలన్న హై కోర్టు. ఆర్టికల్ 226 లో తమ అధికారాలు ఎం ఉన్నాయో అడిషనల్ అడ్వకుట్ జనరల్ గుర్తు చేయవద్దు అన్న హై కోర్టు. ఈడీల నివేదికను తమకు ఎందుకు అందజేయలేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

Next Story
Share it