‘సైరా’ టీమ్ పార్టీ టైమ్
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక సినిమా ‘సైరా నరసింహరెడ్డి’ చిత్ర యూనిట్ ఫుల్ కుషీకుషీగా ఉంది. సినిమా విడుదలైన మరుసటి రోజే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ పెట్టింది. ఈ సినిమా కోసం తాము ఎంత కష్టపడిందీ చెప్పుకుంది ఈ టీమ్. అదే సమయంలో సైరా సినిమా కోసం అసలు రూపాయి కూడా తీసుకోకుండా బిగ్ బి అమితాబచ్చన్, అనుష్క పనిచేశారని చిరంజీవి ప్రకటించారు. ఈ సైరా సందడి కొనసాగించేలా అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఈ టీమ్ కు బారీ పార్టీ ఇచ్చారు.
ఈ పార్టీకి మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు, సైరా చిత్ర యూనిట్ సభ్యులు, ఇతర ఇండస్ట్రీ ప్రముఖులను ఆహ్వానించారు. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్, నిహారిక, అల్లు శిరీష్‌లు, అఖిల్ అక్కినేని, శ్రీకాంత్, దర్శకులు సురేందర్‌రెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, సుకుమార్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, జెమిని కిరణ్‌లు పాల్గొన్నారు.