Telugu Gateway
Cinema

‘సైరా’ విడుదలలో జోక్యం చేసుకోలేం..హైకోర్టు

‘సైరా’ విడుదలలో జోక్యం చేసుకోలేం..హైకోర్టు
X

ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహరెడ్డి విడుదలకు అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. ఈ సినిమా విడుదలను అడ్డుకోజాలమని హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. సైరా వివాదంపై విచారణ చేపట్టిన హైకోర్టు తన తుది తీర్పును మంగళవారం వెలువరించింది. ఇరువర్గాల వాదనను విన్న హైకోర్టు ‘సైరా’ సినిమా విడుదలను ఆపలేమని తేల్చిచెప్పింది.

సినిమాను కేవలం వినోద పరంగానే చూడాలని పిటిషనర్‌కు సూచించింది. ఎంతో మంది మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్టు ఎవరు చూపించారని ప్రశ్నిస్తూనే.. గతంలో గాంధీ, మొఘల్‌ల సామ్రాజ్యాన్ని తెరకెక్కించిన చిత్రాలను ప్రస్తావించింది. సినిమా నచ్చేది నచ్చనిది ప్రేక్షకులకు వదిలేయాలని తెలిపింది.

Next Story
Share it