Telugu Gateway
Andhra Pradesh

పోలవరం పనులకు తొలగిన అడ్డంకి

పోలవరం పనులకు తొలగిన అడ్డంకి
X

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక పరిణామం. రివర్స్ టెండరింగ్ మార్గం ద్వారా పిలిచిన టెండర్లలో కొత్త కాంట్రాక్టర్ తో ఒప్పందం చేసుకోవటానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులను ఏకపక్షంగా రద్దు చేశారంటూ నవయుగా సంస్థ హైకోర్టు ఆశ్రయించటంతో కోర్టు ఈ పనులపై స్టే విధించింది. గురువారం నాడు స్టే ఎత్తివేస్తూ కొత్త సంస్థతో పోలవరం పనులు ప్రారంభించుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. దీంతో పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. వాస్తవానికి ఏపీ సర్కారు నవంబర్ 1 నుంచి పోలవరం పనులు ప్రారంభిస్తామని గతంలో పలుమార్లు ప్రకటించింది.

అయితే ఇంకా ఏపీలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. దీనికి తోడు రివర్స్ టెండరింగ్ వ్యవహారంపై కోర్టులో కేసు..స్టే ఉంది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఇక సర్కారు వేగంగా పనులు ముందుకు నడిపించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు పనులతోపాటు హైడల్ ప్రాజెక్టు పనులను కూడా మెఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రభుత్వం మెఘా ఇంజనీరింగ్ సంస్థతో ఒఫ్పందం కుదుర్చుకుని పోలవరం పనులను పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది.

Next Story
Share it