మాజీ ఎమ్మెల్సీ కేఆర్ అమోస్ మృతి
BY Telugu Gateway10 Oct 2019 9:12 PM IST
X
Telugu Gateway10 Oct 2019 9:12 PM IST
సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కె ఆర్ ఆమోస్ తుది శ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారిలో ఆమోస్ ఒకరు. 1969 లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన అమోస్ ను అప్పటి ప్రభుత్వం డిస్మిస్ చేసింది. తెలంగాణ కోసం మొట్టమొదటి సారి ప్రభుత్వ ఉద్యోగం తొలగించబడ్డ ఉద్యమకారుడు ఆయనే. ఆమోస్ టీఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కెఆర్ ఆమోస్ మృతిపట్ల మంత్రి కేటీ రామారావు తీవ్ర సంతాపం ప్రకటించారు. 1969లో తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి నడిపించిన ఆయన తర్వాతి దశాబ్దాల్లోనూ తన పోరాటాన్ని కొనసాగించారన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి ఆమోస్ చేసిన సేవలను మంత్రి కేటీఆర్ గుర్తు తెచ్చుకున్నారు.
Next Story