Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ‘ఇసుక వారోత్సవాలు’

ఏపీలో ‘ఇసుక వారోత్సవాలు’
X

ఏపీ ఇప్పుడు ఏదైనా తీవ్రమైన సమస్య ఎదుర్కొంటుందా? అంటే అది ఇసుక సమస్యే. ప్రభుత్వానికి కూడా ఇసుక అంశం ఓ పెద్ద సమస్య కూర్చుంది. ఇదే అదనుగా విపక్షాలు అన్నీ సర్కారును టార్గెట్ చేశాయి. దీంతో ముఖ్యంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలు ఇసుక కరవు తీరా ఇసుక సరఫరాచేసేందుకు వీలుగా ఏపీలో ‘ఇసుక వారోత్సవాలు’ జరపాలని నిర్ణయించారు. మంగళవారం నాడు స్పందన కార్యక్రమం సమీక్షలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వారం రోజులపాటు ఇసుక మీదే పనిచేసి.. ఇసుక కొరత గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్ష పార్టీ నేతలు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ‘పళ్లు ఇచ్చే చెట్టుపైనే రాళ్లు వేస్తున్నారు. గతంలో వ్యవస్థ తీవ్ర అవినీతి మయం అయింది. దీన్ని పూర్తిగా రిపేర్‌ చేస్తున్నాం. ఎక్కడైనా అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించాం. ఇసుక తవ్వకాలను అవినీతికి దూరంగా పెట్టగలిగామని గర్వంగా చెప్పగలం. గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు, వరదలు వస్తున్నాయి. వర్షాలు కురవడం రైతులకు మంచిదే. దోచేసిన ఇసుక స్థానంలో కొత్త ఇసుక వచ్చి చేరడం కూడా మంచిదే.

రాబందుల మాదిరిగా మనపై రాళ్లు వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అనవసర ఆరోపణలు చేస్తోంది. వరదల వల్ల ఇసుక ఆశించిన స్థాయిలో తీయలేకపోతున్నాం. వచ్చే వారానికి వరదలు తగ్గుతాయని భావిస్తున్నాం. ఇసుక వారోత్సవం అని కార్యక్రమం పెడతాం. వారం రోజులు ఇసుక మీదే పనిచేద్దాం. ఇసుక గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూద్దాం. వచ్చే వారం రోజుల్లో పరిస్థితులు మెరుగవుతాయి’ అని సీఎం వ్యాఖ్యానించారు.ఇదిలా ఉంటే ‘ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి తర రాష్ట్రాలకు ఇసుక వెళ్లకూడదని పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వద్ద గట్టి పహారా ఉండాలి. డీజీపీ స్వయంగా దీనిని పర్యవేక్షించాలి. ఎంత బాగా పనిచేసినా మనపై విమర్శలు వస్తూనే ఉంటాయి. అందుకే మనం వెంటనే స్పందించాల్సిన అవరసరం ఉంది. భవన నిర్మాణ కార్మికులకు ఇప్పుడు పని దొరకడం లేదన్నది సరికాదు. గతంలో అవినీతి , మాఫియాతో ఇసుకను తరలించేవారు. ఇప్పుడు ప్రభుత్వం అధీనంలోనే ఇసుక రవాణా జరుగుతుంది. మరింతగా కార్మికులకు పనులు లభిస్తాయి. పట్టాభూములున్న రీచ్‌ల్లో తప్ప మిగతా చోట్ల మాన్యువల్‌గా ఇసుక తీయాలని చెప్పాం. వరదలు తగ్గేలోగా వాగులు, వంకల్లో 70 చోట్ల రీచ్‌లను గుర్తించారు’అని సీఎం చెప్పారు.

Next Story
Share it