సోలో బతుకే సో బెటర్ అంటున్న సాయిధరమ్
BY Telugu Gateway7 Oct 2019 5:27 AM GMT
X
Telugu Gateway7 Oct 2019 5:27 AM GMT
సాయి ధరమ్ తేజ్ దూకుడు పెంచాడు. ‘చిత్రలహరి’ సినిమా హిట్ తో జోష్ లోకి వచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న సినిమా ‘ప్రతి రోజూ పండగే’ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఇది ఓ వైపు నడుస్తూ ఉండగానే ఇప్పుడు కొత్తగా ‘సోలో బతుకే సో బెటర్’ అనే కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు సోమవారం నాడు హైదరాబాద్ లో జరిగాయి.
ఈ సినిమాలో సాయికి జోడీగా నభా నటేష్ నటిస్తున్నారు. సుబ్బు దర్శకత్వంలో ఈ కొత్త మూవీ తెరకెక్కనుంది. నవంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. కొత్త సినిమా చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రతి రోజూ పండగ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
Next Story